IPL 2022: రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

delhi capitals wins toss and elect to field first
  • డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడెమీ స్టేడియంలో మ్యాచ్‌
  • టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగ‌నున్న రాజ‌స్థాన్‌
  • పాయింట్ల ప‌ట్టిక‌లో 3వ స్థానంలో రాజ‌స్థాన్‌, 5వ‌ స్థానంలో ఢిల్లీ
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం రాత్రి రాజస్థాన్ రాయ‌ల్స్‌తో ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో మ‌రికాసేప‌ట్లోనే మొద‌లు కానున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జ‌ట్టు రాజస్థాన్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

ఐపీఎల్ తాజా సీజన్‌లో లీగ్ ద‌శ ముగింపున‌కు వ‌చ్చిన ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి జ‌ట్టుకు ప్ర‌తి మ్యాచ్ కూడా కీల‌కం కానుంది. ఇప్ప‌టికే 11 మ్యాచ్‌లు ఆడిన రాజ‌స్థాన్ జ‌ట్టు 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే స‌మ‌యంలో ఢిల్లీ కూడా 11 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం ఐదింటిలో విజ‌యం సాధించి 10 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. వెర‌సి ఈ మ్యాచ్‌లో విజ‌యం రాజ‌స్థాన్ జ‌ట్టు కంటే కూడా ఢిల్లీకే అవ‌స‌రం కానుంది.
IPL 2022
Rajasthan Royals
Delhi Capitals

More Telugu News