Rajasekhar: 'శేఖర్' లిరికల్ సాంగ్ రిలీజ్!

Shekar lyrical song released

  • రాజశేఖర్ తాజా చిత్రంగా 'శేఖర్'
  • మలయాళ 'జోసెఫ్'కి ఇది రీమేక్ 
  • కథానాయికగా ఆత్మీయ రాజన్ పరిచయం
  • ఈ నెల 20వ తేదీన విడుదల

రాజశేఖర్ హీరోగా 'శేఖర్' సినిమా రూపొందింది. ఈ సినిమాకి జీవిత దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళంలో ఆ మధ్య వైవిధ్యభరితమైన కథా చిత్రంగా ప్రశంసలు అందుకున్న 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. కథాపరంగా ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'చిన్ని చిన్ని  ప్రాణం .. చిందులాడే పాదం .. నా  కోసం .. నవ్వు పంచేనా' అంటూ ఈ పాట సాగుతుంది. హీరో .. హీరోయిన్ ఇద్దరూ కూడా తమ పసి బిడ్డను చూసుకుని మురిసిపోయే నేపథ్యంలో వచ్చేపాట ఇది. 

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చిన్మయి -  హేమంత్ మహ్మద్ ఆలపించారు. పాట ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. ఈ సినిమాతో ముస్కాన్ .. ఆత్మీయ రాజన్ కథనాయికలుగా కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రలో శివాని రాజశేఖర్ కనిపించనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News