TPCC President: రేవంత్ రెడ్డితో గోవా మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్ భేటీ

goa ex cm Digambar Kamat meets revants reddy in hyderabad
  • వ్య‌క్తిగ‌త ప‌ర్య‌టన‌కు హైద‌రాబాద్‌కు కామత్‌
  • స్వ‌యంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన గోవా మాజీ సీఎం
  • పార్టీ పటిష్ఠత కోసం రేవంత్‌కు స‌ల‌హాలు ఇచ్చిన సీనియ‌ర్ నేత‌
గోవా మాజీ సీఎం, ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగంబ‌ర్ కామ‌త్ బుధ‌వారం టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన కామత్‌... న‌గ‌రంలోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పార్టీ ప‌టిష్ఠ‌త‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రేవంత్‌కు ఆయ‌న ప‌లు స‌ల‌హాలు, సూచన‌లు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. 

కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గానే కాకుండా విద్యావంతులు అధికంగా ఉండే గోవా లాంటి రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రించిన కామ‌త్‌... రాజ‌కీయ వ్యూహాల్లో దిట్ట‌గానే పేరు గాంచారు. 2007 నుంచి 2012 వ‌ర‌కు గోవా సీఎంగా వ్య‌వ‌హ‌రించిన కామత్‌... ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తున్నా.. తాను మాత్రం నిలిచి గెలుస్తున్నారు. ప్ర‌తి ఎన్నిక‌లోనూ అధికార బీజేపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న రేవంత్ రెడ్డి ఇంటికి స్వ‌యంగా వెళ్ల‌డం, రేవంత్ రెడ్డికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
TPCC President
Revanth Reddy
Congress
Digambar Kamat

More Telugu News