Upasana: టెస్ట్ చేయించుకుంటే కానీ.. నాకు కరోనా సోకినట్టు తెలియలేదు: రామ్ చరణ్ భార్య ఉపాసన

Upasana told that she tested Corona positive last week

  • గత వారం కరోనా బారిన పడ్డానని వెల్లడి
  • చెన్నై వెళ్లేందుకు కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా ఉన్నట్టు తేలిందని వ్యాఖ్య
  • వారం రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానన్న ఉపాసన

  గత వారం తాను కరోనా బారిన పడ్డానని సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తెలిపారు. వైద్యుల సూచనతో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కోలుకున్నానని అన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. 

చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పారు. అయితే ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయని అన్నారు. కేవలం పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని చెప్పారు. 

తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారని... అయితే తనకు అలాంటి సమస్యలు ఎదురు కాలేదని తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయించుకోకపోతే... తనకు కరోనా సోకిందనే విషయం కూడా తెలిసేది కాదని అన్నారు.

Upasana
Ramcharan
Corona Virus

More Telugu News