Kollu Ravindra: చంద్రబాబు కుటుంబానికి నోటీసులిస్తామంటూ గందరగోళం సృష్టిస్తున్నారు: కొల్లు ర‌వీంద్ర‌

kollu ravindra slams ysrcp

  • అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటార‌న్న ర‌వీంద్ర‌
  • చంద్రబాబు భార్య భువనేశ్వరిని గతంలో అసెంబ్లీలో అవమానించార‌ని వ్యాఖ్య‌
  • ఇప్పుడు అక్రమ కేసులు బనాయించేలా కుట్ర పన్నుతున్నారని ఆరోప‌ణ‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానికి నోటీసులిస్తామంటూ ఏపీలో గందరగోళం సృష్టిస్తున్నారని టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తే భ‌విష్య‌త్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయ‌న‌ హెచ్చరించారు. 

చంద్రబాబు భార్య భువనేశ్వరిని కూడా గతంలో అసెంబ్లీలో అవమానించార‌ని అన్నారు. ఇప్పుడు భువనేశ్వరిపై అక్రమ కేసులు బనాయించేలా కుట్ర పన్నుతున్నారని ఆయ‌న ఆరోపించారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టారని ఆయ‌న చెప్పారు. 

Kollu Ravindra
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News