Mahesh Babu: రాజమౌళితో మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

Mahesh Babu in Rajamouli

  • ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వస్తున్న మహేశ్ బాబు 
  • ఆ తరువాత త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి
  • వచ్చే ఏడాదిలోనే మొదలుకానున్న రాజమౌళి ప్రాజెక్టు
  • కథాకథనాలపై జరుగుతున్న కసరత్తు

మహేశ్ బాబు తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి 'సర్కారువారి పాట' రెడీ అవుతోంది. పరశురామ్  దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. మహేశ్ బాబు ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా ఎప్పుడు ఉండనుందనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదిలోనే మొదలవుతుందని తెలుస్తోంది. వచ్చే మార్చి నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు కావొచ్చని చెబుతున్నారు. 

ఇది దక్షిణాఫ్రికా నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ అని అంటున్నారు. ఆల్రెడీ  రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ కథను వినిపించడం జరిగిపోయింది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేయడం .. స్క్రీన్ ప్లే చేయడం వంటి వాటిపై రాజమౌళి ఎక్కువ ఫోకస్ చేస్తారు .. వాటికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అందువలన ఈ సినిమాకి ఇంత సమయం పడుతుందని అంటున్నారు.

Mahesh Babu
Rajamouli
Tollywood
  • Loading...

More Telugu News