Sake Sailajanath: ఏ మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్తారు?: శైలజానాథ్

Silajanath fires on Jagan

  • వైసీపీ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు వచ్చిందన్న శైలజానాథ్ 
  • అభివృద్ధి అంటే తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కడం కాదంటూ కామెంట్ 
  • ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా తాడేపల్లిలో కూర్చోబెడతారని వ్యాఖ్య 

మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజలే తిరగబడే రోజు వచ్చిందని అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం జనాల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను సాధించడంలో పూర్తిగా విఫలమయినందుకా? పన్నులు పెంచినందుకా? ప్రాజెక్టులు పూర్తి చేయనందుకా? అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నందుకా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అభివృద్ధి అంటే తాడేపల్లి ప్యాలస్ లో కూర్చొని బటన్ నొక్కడం కాదని విమర్శించారు. ప్రజలే బటన్ నొక్కి మిమ్మల్ని శాశ్వతంగా తాడేపల్లిలో కూర్చోబెడతారని అన్నారు. పొత్తుల పంచాయతీని వదిలి... రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Sake Sailajanath
Congress
Jagan
YSRCP
  • Loading...

More Telugu News