Mahesh Babu: పరశురామ్ మళ్లీ దొరికిపోయినట్టే!

Sarkaruvari pata Movie Update

  • ముందుగా మహేశ్ కి టైటిల్ చెప్పానన్న పరశురామ్ 
  • లీక్ అయ్యాకే తనకి తెలిసిందన్న మహేశ్ బాబు 
  • ఆ డైలాగ్ ను వైఎస్ మాటగా చెప్పిన పరశురామ్
  • అది 'యాత్ర' సినిమాలోది మాత్రమే అంటున్న నెటిజన్లు  

లవ్  .. ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని పరశురామ్ తెరకెక్కించిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సారి యాక్షన్ ను కూడా జోడించి ఆయన 'సర్కారువారి  పాట' సినిమాను చేశాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పరశురామ్ వరుస ఇంటర్వ్యూలిస్తూ వెళుతున్నాడు. 

ఈ సినిమా టైటిల్ అనుకోగానే మహేశ్ కి కాల్ చేసి చెప్పాననీ, టైటిల్ అదిరిపోయిందని ఆయన అన్నారని పరశురామ్ చెప్పాడు. అయితే టైటిల్ ఏమిటనేది లీక్ అయిన తరువాతనే తనకి తెలిసిందనీ, అప్పుడు తాను పరశురామ్ కి కాల్ చేశానని ఆయన ముందే మహేశ్ అన్నారు.

ఇక ఈ సినిమాలో 'నేను విన్నాను .. నేను ఉన్నాను' అనే మహేశ్ డైలాగ్ ను గురించి పరశురామ్ ప్రస్తావించాడు. వైఎస్ నోటి వెంట తాను ఈ మాటను విన్నట్టుగా ఆయన చెప్పాడు. అయితే, వైఎస్ ఎప్పుడూ ఎక్కడా ఈ మాట అన్నట్టుగా ఆధారాలు లేవనీ, ఇది 'యాత్ర' సినిమా డైలాగ్ గానే పాప్యులర్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Mahesh Babu
Keerthi Suresh
Parashuram
Sarkaruvaripata Movie
  • Loading...

More Telugu News