Nani: 'అంటే .. సుందరానికీ' నుంచి సాంగ్ రిలీజ్!

Ante Sundaraniki movie update

  • నాని నుంచి మరో విభిన్నమైన సినిమా 
  • కథానాయికగా నజ్రియా పరిచయం 
  • ఓ మాదిరిగా అనిపిస్తున్న వివేక్ సాగర్ బాణీ
  • జూన్ 10వ తేదీన సినిమా విడుదల   

నాని హీరోగా వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఒక బ్రాహ్మణ యువకుడికీ .. క్రిస్టియన్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథనే ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వివేక్ సాగర్ దర్శకత్వం వహించాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఎంత చిత్రం.. ఎన్నేసి జ్ఞాపకాలు .. ఊపిరాడేదెలా..  ఎంతమాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా' అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి - కీర్తన ఆలపించారు.

లిరికల్ సాంగ్ చూస్తే ట్యూన్ అంతగా పట్టనట్టుగా అనిపిస్తుంది. కాస్త గందరగోళంగాను అనిపిస్తుంది. సినిమాలో సందర్భాన్ని బట్టి వస్తుంది గనుక ఏమైనా ఎక్కుతుందేమో చూడాలి. నదియా .. రోహిణి .. నరేశ్ .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Nani
Nazriya
Vivek Athreya
Ante Sundaraniki Movie

More Telugu News