venu gopala krishna: అందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించాను: మంత్రి వేణుగోపాలకృష్ణ

venu gopala krishna slams tdp

  • కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబానికి సుబ్బారెడ్డి అండగా నిలిచార‌న్న గోపాల‌కృష్ణ‌
  • శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని కొంద‌రు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబు శెట్టిబలిజలను ఎంతగా అవమానించారో తెలియదా? అని ప్ర‌శ్న‌

ఇటీవ‌ల క‌న్నుమూసిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించానని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వివరణనిచ్చారు. వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించినందుకు తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని కొంద‌రు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. 

కుడిపూడి చిట్టబ్బాయి వైఎస్‌ జగన్ వెంట నడిచారని, త‌మ పార్టీ విజయం కోసం కృషి చేశారని అన్నారు. చిట్టబ్బాయికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారని, ఆ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని తెలిపారు. శెట్టిబలిజ వర్గానికి సీఎం జగన్‌ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారని ఆయ‌న తెలిపారు.  

తాను చంద్రబాబు నాయుడిలా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని అన్నారు. గ‌తంలో చంద్రబాబు నాయుడు శెట్టిబలిజలను ఎంతగా అవమానించారో తెలియదా? అని ఆయ‌న నిల‌దీశారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క శెట్టిబలిజకైనా మంత్రి పదవి ఇచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 


venu gopala krishna
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News