Venkatesh Daggubati: మాది మెగా ఫ్యామిలీ .. మాది దగ్గుబాటి ఫ్యామిలీ: 'ఎఫ్ 3' నుంచి ట్రైలర్ రిలీజ్!

F3 movie trailer released

  • వినోదభరిత చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 3'
  • నవ్వులు పూయిస్తున్న ట్రైలర్ 
  • హీరోల ఇంటిపేర్లతో పేలిన డైలాగ్స్ 
  • ఈ నెల 27వ తేదీన విడుదలవుతున్న సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ప్రపంచానికి తెలిసి పంచభూతాలు ఐదు .. కానీ ఆరో భూతం ఒకటుంది .. దాని పేరే డబ్బు' అంటూ ఈ ట్రైలర్ మొదలైంది. 'డబ్బున్నవాడికి ఫన్ .. లేనివాడికి ఫ్రస్ట్రేషన్'. 'వాళ్లది దగా ఫ్యామిలీ .. మాది మెగా ఫ్యామిలీ' .. 'వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

డబ్బు కలిసివస్తుందనే ఆశతో మనీ ప్లాంట్ బిర్యానీ .. మనీ ప్లాంట్ చారు .. మనీ ప్లాంట్ వేపుడు చేసి తినిపించే సీన్ బాగుంది. మెహ్రీన్ బంగారు నగలు పెట్టుకుంటూ ' చంద్రముఖి'లా ప్రవర్తించడం నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే అనిల్ చెప్పినట్టుగానే, 'ఎఫ్ 2' ను మించిన ఫన్ ఈ సినిమాలో ఉండటం ఖాయమనిపిస్తోంది.

Venkatesh Daggubati
Thamannah
Varun Tej
Mehreen
F3 Movie

More Telugu News