Geetha Arts: అల్లు అరవింద్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా మహిళా ఆర్టిస్ట్ నిరసన

Woman creates ruckus at Geetha Arts

  • హైదరాబాదులోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద మహిళ హల్ చల్
  • తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
  • ఎలాంటి బకాయిలు పెండింగ్ లో లేవన్న గీతా ఆర్ట్స్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఓ మహిళా ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా హల్ చల్ చేసింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా గీతా ఆర్ట్స్ తనను చాలా ఇబ్బంది పెడుతోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించింది. ఉదయం 5.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆమె నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. తనకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. 

ఈ నేపథ్యంలో, ఆమె గురించి గీతా ఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని చెపుతున్నారు. ఆమెకు ఎలాంటి బకాయిలు పెండింగ్ లో లేవని గీతా ఆర్ట్స్ మేనేజర్లు తెలిపారు.

Geetha Arts
Office
Women Artist
Semi **
Protest

More Telugu News