Mahesh Babu: అలా చెప్పకపోతే ఎవరొచ్చి నాతో యాక్ట్ చేస్తారు?: మహేశ్ బాబు

Mahesh Babu Interview

  • 'సర్కారువారి పాట' ప్రమోషన్స్ లో మహేశ్ 
  • 'మహానటి'కి మనమిచ్చే సలహా ఏముంటుందంటూ వ్యాఖ్య 
  • చేసేదే రెండేళ్లకి ఒక సినిమా అంటూ నవ్వేసిన మహేశ్ 
  • ఫుడ్డు కరెక్టుగా తీసుకుంటానంటూ వివరణ

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. 'కీర్తి సురేశ్ కి ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? అనే ప్రశ్నకు అందుకు ఆయన స్పందిస్తూ 'మహానటి'కి ఏం సలహా ఇస్తాం? అంటూ నవ్వేశారు.

బెస్ట్ కో స్టార్ అని ఇంతవరకూ మీరు ఎంతమంది హీరోయిన్లను చెబుతారు? అనే ప్రశ్నకు మహేశ్ నవ్వుతూ .. "అలా చెప్పాలి కదండీ ..  చేసేదే రెండేళ్లకి ఒక సినిమా అని మీరే అంటున్నారు. మరి అది కూడా చెప్పకపోతే ఎవరొచ్చి యాక్ట్ చేస్తారు చెప్పండి" అన్నారు. 

నిజంగానే మీ పక్కన గ్లామరస్ గా కనిపించడమనేది హీరోయిన్లకి కష్టమే. నిజం చెప్పండి, ఇంత గ్లామరస్ గా కనిపించడం కోసం మీరు ఏం తింటారు? అనే ప్రశ్నకి సమాధానంగా "అన్నీ తింటాను  .. కాకపోతే కరెక్టుగా తింటాను" అని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే  నమ్మకాన్ని మహేశ్ వ్యక్తం చేశారు.

Mahesh Babu
Keerthi Suresh
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News