Samantha: ఆగస్టు 12న గట్టిపోటీనే ఉందే!

New Movies Update

  • ఆగస్టు 12న సమంత 'యశోద' విడుదల 
  • అదే రోజున థియేటర్లకు వస్తున్న 'ఏజెంట్'
  • ఇదే డేట్ ను ఖాయం చేసుకున్న నితిన్ 
  • ఒక రోజు ముందుగానే పలకరించనున్న చైతూ మూవీ

సమంత ప్రధాన పాత్రలో 'యశోద' సినిమా రూపొందుతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, వరలక్ష్మీశరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక ఇదే రోజున అఖిల్ సినిమా 'ఏజెంట్' ను రిలీజ్ చేస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి సాక్షి వైద్య పరిచయమవుతుండటం విశేషం. కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. 

ఇక రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' కూడా ఇదే రోజున బరిలోకి దిగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను కూడా వదిలింది. ఆమీర్ తో కలిసి చైతూ చేసిన 'లాల్ సింగ్ చద్దా' పాన్ ఇండియా రిలీజ్ లో భాగంగా ఒక రోజు ముందుగా తెలుగులోను రానుంది. సమంత .. చైతూ .. అఖిల్ సినిమాలు ఇంచుమించు ఒకేసారి థియేటర్లలో దిగుతుండటం విశేషం.

Samantha
Nagachaitanya
Akhil
Nithin
  • Loading...

More Telugu News