Sekhar Movie: వైజాగ్ లో సందడి చేసిన రాజ'శేఖర్' టీమ్.. ఫొటోలు ఇవిగో!

Sekhar movie promotion event in Vizag

  • ఈ నెల 20న విడుదలవుతున్న 'శేఖర్'
  • ఆంధ్రా యూనివర్శిటీలో నిన్న సాయంత్రం భారీ ప్రమోషన్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్

రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'శేఖర్' సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. ఈ చిత్రంలో గడ్డంతో, యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న రాజశేఖర్ అందరినీ ఆకట్టుకున్నారు. రాజశేఖర్ కెరీర్ లో మరో హిట్ ఖాయమనే అంచనాలు ఇప్పటికే ఇండస్ట్రీలో నెలకొన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. 

మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. చిత్ర యూనిట్ నిన్న వైజాగ్ లో సందడి చేసింది. నిన్న సాయంత్రం 5 గంటలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహుడిని చిత్ర యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీలో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత, వీరి కుమార్తెలు శివాని, శివాత్మికలతో పాటు నిర్మాతలు హాజరయ్యారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో టారస్ సినీ కార్ప్, పెగాసన్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sekhar Movie
Vizag
Promotion Event
Tollywood
Rajasekhar
Jeevitha
Shivathmika Rajasekhar
Shivani Rajasekhar
  • Loading...

More Telugu News