RGV: నేను మంచి కొడుకును కాదు అమ్మా.. అంటూ ఆర్జీవీ స్పెషల్ పోస్ట్

RGV Photo Brings Netizens In Shock

  • ఇవాళ మాతృదినోత్సవం
  • తన తల్లితో దిగిన ఫొటో పెట్టిన వర్మ
  • షాక్ అవుతున్న నెటిజన్లు
  • ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్లు

రామ్ గోపాల్ వర్మ.. ఆ పేరే ఒక సంచలనం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. ఏ విషయాన్నైనా సరే సూటిగా.. వివాదాస్పదంగా చెప్పడం ఆయనకే చెల్లుతుంది. ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. తాను మంచి కొడుకును కాదంటూ వ్యాఖ్యానించారు. 

‘‘హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ’’ అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘మీలో ఈ యాంగిల్ కూడా ఉందా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

‘‘మీరు మారిపోయారు సర్’’ అంటూ జోకులేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ పెట్టింది నువ్వేనా అంటూ అడుగుతున్నారు. మరో యూజర్ ఓ అడుగు ముందుకేసి ‘‘ఎంత పెద్ద ఎదవైనా అమ్మ ముందు పసివాడే’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పోస్ట్ పెట్టడం సగటు నెటిజన్ కు షాక్ కలిగించేదే.

RGV
Ramgopal Varma
Mothers Day
Tollywood
Bollywood

More Telugu News