: కుంభమేళాలో అగ్ని ప్రమాదం
పవిత్ర కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 4 లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఒక భక్తుడు విగత జీవుడిగా మారాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాలు 30 వరకు దహనం అయ్యాయి. వెంటనే అగ్నిమాపక దళాలు స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుంభమేళా ప్రారంభమయ్యాక లోగడ రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.