Mahesh Babu: కీర్తి సురేశ్ ఆశలన్నీ 'సర్కారువారి పాట'పైనే!

Sarkaruvari  paata Movie  Update

  • 'మహానటి'తో భారీ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేశ్
  • ఆ సినిమా తరువాత తెలుగులో వచ్చేసిన గ్యాప్ 
  • జీరో సైజ్ కోసం ట్రై చేయడం ఆమె చేసిన మరో పొరపాటు 
  • కలిసిరాని నాయిక ప్రధానమైన సినిమాలు 
  • టాలీవుడ్లో సరైన హిట్ కోసమే కీర్తి వెయిటింగ్  

తెలుగు తెరకి కీర్తి సురేశ్ 'నేను శైలజ' సినిమాతో పరిచయమైంది. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత చేసిన 'నేను లోకల్' సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆడిపాడే పాత్రలతో ఈ అమ్మాయి ఓ అరడజను సినిమాలు చేస్తుందేమోనని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వాళ్లంతా ఆశ్చర్యపోయేలా 'మహానటి'లో ఆమె విశ్వరూపం చూపించింది.

ఇక తెలుగులో కీర్తి సురేశ్ ను పట్టుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. అయితే ఆమె తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసి తమిళంలో వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్లింది. ఆ తరువాత తెలుగులో ఆమె ఒప్పుకున్న సినిమాలు నాయిక ప్రధానమైనవే. ఈ సమయంలోనే ఆమె బాగా సన్నబడింది. దాంతో లుక్ పరంగా కూడా ఆమె 'మిస్ ఇండియా' .. ' గుడ్ లక్ సఖి' వంటి సినిమాల్లో అలరించలేకపోయింది. 

ఇలా కీర్తి సురేశ్ ఒకదాని తరువాత ఒకటిగా పొరపాట్లు చేస్తూ వచ్చింది. తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్న విధంగా తెరపై కీర్తి సురేశ్ కనిపించి .. ఆమె హిట్ అందుకుని చాలకాలమే అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న 'సర్కారువారి పాట' పైనే ఆమె గట్టి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఆశించే హిట్ పడుతుందేమో చూడాలి.

Mahesh Babu
Keerthi suresh
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News