Cyclonic Storm: ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా రానున్న తుపాను... ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ
- రేపటికి తుపానుగా మారే అవకాశం
- ఏపీకి వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని, ఇది వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ప్రస్తుతం కార్ నికోబార్ ప్రాంతానికి పశ్చిమంగా 170 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ వాయుగుండం రేపటికి తుపానుగా మారే అవకాశముందని తెలిపింది.
ఇది తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా పయనించే క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది. 10వ తేదీ నాటికి ఇది దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిక్కులో పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.