Surekha Vani: వెండితెరకు పరిచయం అవుతున్న సురేఖ వాణి కుమార్తె

Surekha Vani daughter Supritha makes silver screen debut
  • లేచింది మహిళా లోకం చిత్రంలో నటిస్తున్న సుప్రీత
  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో లేచింది మహిళా లోకం చిత్రం
  • పలు షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన సుప్రీత
  • తల్లితో చేసిన డ్యాన్స్ వీడియోలతో పాప్యులారిటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు పొందిన సురేఖ వాణి ఇప్పుడు తన కుమార్తె సుప్రీతను కూడా వెండితెరకు పరిచయం చేస్తోంది. మంచు లక్ష్మి ప్రధానపాత్ర పోషిస్తున్న 'లేచింది మహిళా లోకం' చిత్రంలో సుప్రీత కూడా నటిస్తోంది. ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలను మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది.

కాగా, సుప్రీతకు కెమెరా కొత్తకాదు. ఆమె ఇప్పటిదాకా అనేక షార్ట్ ఫిలింస్ లో నటించింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. అంతేకాదు, తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే డ్యాన్స్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా అలరిస్తుంటాయి.
Surekha Vani
Supritha
Debut
Tollywood

More Telugu News