TPCC President: పెళ్లయిన తొలినాళ్ల‌లో రేవంత్ రెడ్డి ఇలా ఉన్నారు!

revanth reddys rare photo in social media

  • నేడు రేవంత్ 30వ వివాహ వార్షికోత్స‌వం
  • టీపీసీసీ చీఫ్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌
  • అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత‌

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించి శ‌నివారం ఓ స్పెష‌ల్ డే. ఎందుకంటే రేవంత్ వివాహం చేసుకుని నేటికి 30 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పార్టీ శ్రేణుల నుంచి, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున గ్రీటింగ్స్ అందుతున్నాయి. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌మిటీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న దినేశ్ కుమార్‌... రేవంత్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ ఫొటోలో త‌న భార్యతో క‌లిసి నేల‌పై కూర్చుని ఉన్న రేవంత్ రెడ్డిని చూస్తే... టక్కున గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. పెళ్లయిన తొలి నాళ్ల‌లో తీయించుకున్న ఆ ఫొటోలో రేవంత్ రెడ్డి చాలా బ‌క్క ప‌ల‌చ‌గా ఉన్నారు. నాడు రాజ‌కీయాల‌తో సంబందం లేకుండా సాగిన రేవంత్‌...ఆ త‌ర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్సీగా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన ఆయ‌న‌ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. తాజాగా ఎంపీగా కొన‌సాగుతూనే టీపీసీసీ చీఫ్ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.

TPCC President
Revanth Reddy
Congress
Marriage Anniversary

More Telugu News