Rahul Gandhi: తాజ్ కృష్ణ హోట‌ల్‌లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌తో రాహుల్ భేటీ

rahul meets gaddar

  • రాహుల్‌ను క‌లిసిన గ‌ద్ధ‌ర్‌, హ‌ర‌గోపాల్, చెరుకు సుధాక‌ర్‌, కంచె ఐల‌య్య‌
  • కాసేప‌ట్లో రాహుల్ సంజీవ‌య్య పార్క్‌కు..
  • సంజీవ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు
  • ఆ త‌ర్వాత‌ గాంధీ భ‌వ‌న్ చేరుకోనున్న రాహుల్

తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో తాజ్ కృష్ణలో ప్రత్యేకంగా స‌మావేశమ‌య్యారు. ఆయ‌న‌ గ‌ద్ధ‌ర్‌, హ‌ర‌గోపాల్, చెరుకు సుధాక‌ర్‌, కంచె ఐల‌య్య‌తో వేర్వేరుగా స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అలాగే, మ‌రికొంత మంది రాహుల్‌ను క‌లిశారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రంలోని ప‌రిస్థితులు వంటి అంశాల‌పై చ‌ర్చించారు. కాసేప‌ట్లో రాహుల్ సంజీవ‌య్య పార్క్‌కు బ‌య‌లుదేర‌నున్నారు.

మాజీ ముఖ్యమంత్రి సంజీవ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ పార్కును సంద‌ర్శించి, ఆయ‌న‌కు నివాళులు అర్పించనున్నారు. ఆ త‌ర్వాత‌ గాంధీ భ‌వ‌న్ చేరుకుని, కాంగ్రెస్ పార్టీ నేత‌లతో స‌మావేశం అవుతారు. కాంగ్రెస్ స‌భ్యత్వ న‌మోదులో కీల‌క‌పాత్ర పోషించిన స‌య‌న్వ‌యక‌ర్త‌ల‌ను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప‌రిచ‌యం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గాంధీభ‌వ‌న్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తారు.

  • Loading...

More Telugu News