Mahesh Babu: నా నెక్స్ట్ మూవీ హీరో తనే .. క్లారిటీ ఇచ్చిన పరశురామ్!

Nagachaitanya in Parashuram Movie

  • 'సర్కారువారి పాట'పై పెరుగుతున్న అంచనాలు   
  •  ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల
  •  హిట్ ఖాయమంటున్న పరశురామ్ 
  •  నెక్స్ట్ మూవీ చైతూతోనే అంటూ ఇచ్చిన క్లారిటీ   

'గీత గోవిందం' సినిమాతో మంచి హిట్ ఇచ్చిన పరశురామ్, చాలా గ్యాప్ తరువాత 'సర్కారువారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు రానుంది. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా, తమన్ స్వరపరిచిన పాటలతోనే సగం హిట్ అనిపించుకుంది.

ఈ సినిమా తరువాత నాగచైతన్యతో పరశురామ్ సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. మహేశ్ తో సినిమా ఛాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు గనుక, చైతూతో రెడీ చేసుకున్న ప్రాజెక్టు పక్కన పెట్టేసి పరశురామ్ ఈ వైపు వచ్చాడు. ఈ సినిమా తరువాత చైతూ ప్రాజెక్టును పరశురామ్ చేయకపోవచ్చుననే ప్రచారం ఊపందుకుంది.  

 తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అంతా రెడీగానే ఉంది గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళతామని అన్నాడు. కమిట్ మెంట్ ప్రకారం పరశురామ్ మళ్లీ వెనక్కి వచ్చి చైతూతో సినిమా చేయడం విశేషమే. ఈ సినిమాలో కథానాయికలుగా పూజ హెగ్డే - రష్మికల పేర్లు వినిపిస్తున్నాయి.

Mahesh Babu
Parashuram
Naga Chaitanya
  • Loading...

More Telugu News