Mumbai Indians: రాణించిన రోహిత్, ఇషాన్, టిమ్ డేవిడ్... ముంబయి భారీ స్కోరు

Mumbai Indians posts huge total against Gujarat Titans

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • బ్యాటింగ్ కు దిగిన ముంబయి
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్
  • శుభారంభం అందించిన ఇషాన్, రోహిత్
  • ధాటిగా ఆడిన టిమ్ డేవిడ్

టోర్నీలో తొలిసారిగా ముంబయి ఇండియన్స్ జట్టు ఆశించిన రీతిలో బ్యాటింగ్ చేసింది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఓపెనర్లు శుభారంభం అందించగా, మిడిలార్డర్ రాణించడంతో ముంబయి భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 29 బంతుల్లో 45, రోహిత్ శర్మ 28 బంతుల్లో 43, టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 44 పరుగులు చేశారు. అజేయంగా నిలిచిన టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. 

సూర్యకుమార్ యాదవ్ (13), కీరన్ పొలార్డ్ (4) విఫలమయ్యారు. తిలక్ వర్మ (21) మరోసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 1, ప్రదీప్ సాంగ్వాన్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.

Mumbai Indians
Tim David
Ishan Kishan
Rohit Sharma
Gujarat Titans
IPL
  • Loading...

More Telugu News