Deepinder Goyal: తమ డెలివరీ భాగస్వాముల పిల్లల చదువుల కోసం రూ.700 కోట్లు... జొమాటో వ్యవస్థాపకుడి దాతృత్వం

Zomato founder Deepinder Goyal announces huge donation

  • కీలక నిర్ణయం తీసుకున్న దీపిందర్ గోయల్
  • జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ కు విరాళం
  • ఈఎస్ పీవోల నుంచి విరాళం మొత్తం బదలాయింపు

దేశంలో ఉన్న ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో అగ్రగామిగా కొనసాగుతోంది. తాజాగా జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన పెద్ద మనసు చాటుకున్నారు. తమ కంపెనీ డెలివరీ భాగస్వాముల పిల్లల చదువుల కోసం రూ.700 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ విరాళాన్ని జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ కు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈఎస్ పీవోల నుంచి ఈ మొత్తాన్ని విరాళంగా బదలాయిస్తున్నట్టు దీపిందర్ గోయల్ వివరించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు మెమో పంపించారు.

Deepinder Goyal
Donation
Zomato
Delivery
  • Loading...

More Telugu News