Rana: థియేటర్లలోనే 'విరాటపర్వం' .. రిలీజ్ డేట్ ఖరారు!

Virataparvam release date confirmed

  • రానా హీరోగా రూపొందిన 'విరాటపర్వం'
  • ఆయన సరసన నాయికగా నటించిన సాయిపల్లవి  
  • ముఖ్యమైన పాత్రల్లో నటించిన ప్రియమణి, నందిత దాస్ 
  • జూలై 1వ తేదీన విడుదల కానున్న సినిమా 

రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుని చాలా కాలమైంది. అయితే ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీలో వస్తుందా? అనే సందేహం అందరిలో చోటుచేసుకుంది.

సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన 'దృశ్యం 2' .. 'నారప్ప' సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. దాంతో 'విరాటపర్వం' కూడా ఓటీటీలోనే రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు .. ఆ సినిమా తరువాత షూటింగు పూర్తిచేసుకున్న సినిమాలు కూడా విడుదలైపోయాయి. 'విరాటపర్వం' జాడలేకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. జూలై 1వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి .. నందిత దాస్ .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Rana
Sai Pallavi
Priyamani
  • Loading...

More Telugu News