KRMB: ​​66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీ మాకు ఆమోదయోగ్యం కాదు: తెలంగాణ

KRMB meeting in Hyderabad

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • హైదరాబాదులో కేఆర్ఎంబీ సమావేశం
  • 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీకి తెలంగాణ డిమాండ్

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నేడు హైదరాబాదులో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ తన బాణీని స్పష్టంగా వినిపించింది. 66:34 నిష్పత్తిలో జలాల పంపిణీని గట్టిగా తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు సమానంగా నీటి వాటాలు ఇవ్వాలని తెలంగాణ పట్టుబట్టింది.

66:34 నిష్పత్తిలో జలాల పంపిణీలో తాము భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీని కోరారు. ఇదే విషయమై రజత్ కుమార్ ఇటీవల కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ కూడా రాశారు.

KRMB
Andhra Pradesh
Telangana
Distribution
  • Loading...

More Telugu News