Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

ruckus at botsa office

  • పదవ‌ తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో ఏబీవీపీ ఆందోళ‌న‌
  • క్యాంపు కార్యాలయం ముట్టడికి య‌త్నం
  • భారీగా మోహ‌రించిన పోలీసులు 
  • పోలీసులు, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌ తోపులాట

ఏపీలో పదవ‌ తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్ర‌యత్నించారు. అప్ప‌టికే అక్క‌డ భారీగా మోహ‌రించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

దీంతో పోలీసులు, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌ తోపులాట జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆటలు ఆడుతోందంటూ ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ప‌ద‌వికి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Botsa Satyanarayana
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News