Tollywood: ‘మ..మ..మహేశా..’.. సర్కారు వారి మాస్ సాంగ్.. ఎప్పుడంటే..!

Mass Number From Sarkaru Vari Paata to hit fans tomorrow
  • ఈ సీజన్ లో అత్యంత మాస్ సాంగ్
  • రేపే విడుదల అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
  • ఈ నెల 12న సినిమా విడుదల
సర్కారు వారి మాస్ సాంగ్ సిద్ధమైపోయింది. మాస్ మసాలాతో అందరినీ ఉర్రూతలూగించేందుకు వచ్చేస్తోంది. ‘మ..మ..మహేశా..’ అంటూ హీట్ పెంచేందుకు స్పీడ్ గా దూసుకొచ్చేస్తున్నాడు. మహేశ్ ‘సర్కారు వారి పాట’ నుంచి రేపు మాస్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా మహేశ్ అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది మైత్రీ మూవీ మేకర్స్. 

‘‘సర్కారు వారి పాట మేనియా మరింత పీక్ కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్ లోనే అత్యంత మాస్ సాంగ్ ‘మ..మ..మహేశ్’ రేపే విడుదల’’ అని పేర్కొంది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మించింది. ఈ నెల 12న తెరపైకి రానుంది సర్కారు వారి పాట.
Tollywood
Mahesh Babu
Sarkaru Vaari Paata
Keerthy Suresh
Parashuram

More Telugu News