ar rahman: త‌న పెళ్లి ఫొటోల‌ను పోస్ట్ చేసిన ఏఆర్ రెహమాన్ కుమార్తె

khatija shares her marriage pics

  • సినీ రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా ప‌నిచేస్తోన్న రియాస్ దీన్ షేక్
  • అత‌డిని పెళ్లాడిన రెహమాన్ కుమార్తె ఖతీజా 
  • ఇది ఎంతో సంతోష‌క‌రమైన‌ రోజంటూ పోస్ట్

సినీ రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా ప‌నిచేస్తోన్న రియాస్ దీన్ షేక్ మొహ‌మ్మ‌ద్ తో సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్‌ నిశ్చితార్థం గ‌త ఏడాది డిసెంబరు 29న ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. రియాస్, ఖ‌తీజాల వివాహం తాజాగా సింపుల్‌గా జ‌రిగింది. 

పెళ్లి ఫొటోలను ఖతీజా సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌రమైన‌ రోజ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు ఖ‌తీజా త‌న ఇన్ స్టాగ్రామ్‌ పోస్టులో రాసింది. ఏఆర్ రెహ‌మాన్ కూడా ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ జంట‌ను భ‌గ‌వంతుడు దీవించాల‌ని పేర్కొన్నారు.  

              

ar rahman
Tamilnadu
marriage
  • Loading...

More Telugu News