AP High Court: అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. విచారణ వాయిదా

high court asks status report

  • నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారన్న పిటిష‌నర్
  • ఆయా అంశాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం
  • కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు
  • తదుపరి విచారణను జూలై 12కు వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ స‌ర్కారు అమలు చేయటం లేదని రైతుల తరఫున న్యాయవాది మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయ‌గా, దానిని కోర్టు ఈ రోజు ప‌రిశీలించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు. 

అలాగే, నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆయా అంశాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.
 

  • Loading...

More Telugu News