Mahesh Babu: మహేశ్ గ్లామర్ సీక్రెట్ అదే: రామ్ లక్ష్మణ్

Ram lakshman Interview

  • మహేశ్ బాబు గురించి ప్రస్తావించిన రామ్ లక్ష్మణ్
  • ఆయనను చాలా దగ్గరగా గమనించామంటూ వ్యాఖ్య  
  • బాబు రెండు పూటలా వ్యాయామం చేస్తారంటూ వెల్లడి  
  • ఆయన ఆరోగ్య రహస్యం అదే అంటూ వివరణ 

మహేశ్ బాబుతో దర్శకుడు పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాకి రామ్ - లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా వ్యవహరించారు. తాజా ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ .. "మహేశ్ బాబుతో ఇంతకుముందు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం చేశాము.

ఆ సినిమా కోసం మేము కశ్మీర్ వెళ్లాము .. అక్కడ అసలే విపరీతమైన చలి. ఈ చలిలో ఎలారా నాయనా అని మేము అనుకున్నాము. కానీ అంత చలిలో పొద్దున్నే లేచి మహేశ్ బాబు వ్యాయామం చేయడం చూసి షాక్ అయ్యాము. షూటింగు చేసి వచ్చి అలసిపోయామని మేము అనుకుంటే, ఆయన మళ్లీ వ్యాయామం చేసేవారు.

అక్కడ ఉన్నన్ని రోజులు ఆయనను దగ్గరగా చూడటం వలన, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోను వ్యాయామం చేయడం మానుకోరనే విషయం అర్థంమైంది. హెల్త్ విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారనేది చూశాము. ఇప్పటికీ ఆయన అంత గ్లామర్ గా .. హ్యాండ్సమ్ గా కనిపించడానికి కారణం అదే" అని చెప్పుకొచ్చారు.

Mahesh Babu
Keerthi Suresh
Sarkaruvari Pata
  • Loading...

More Telugu News