Vishwak Sen: 'స్టూడెంట్ జిందాబాద్' అంటున్న విష్వక్సేన్!

Vishwaksen  in Student Zundabad Movie

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అశోకవనంలో అర్జున కల్యాణం'
  • ఈ కథ సరదాగా సాగిపోతుందన్న విష్వక్ 
  • త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందంటూ స్పష్టీకరణ 
  • కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నానంటూ వివరణ

విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ఈ నెల 6వ తేదీన విడుదలవుతోంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. రేపే విడుదల కానుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. 
 
తాజా ఇంటర్వ్యూలో విష్వక్ సేన్ మాట్లాడుతూ .. "ఈ సినిమాను చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చాలామంది తమ పెళ్లిలో జరిగిన సంఘటనలను .. తమ చుట్టాల తీరును గుర్తుచేసుకుంటారు. ఇక నా తదుపరి సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం 'దాస్ కా ధమ్కీ' లైన్లో ఉంది. 'ఓ మై కడవులే' తమిళ సినిమాకి రీమేక్ గా 'ఓరి దేవుడా' నిర్మితమవుతోంది. 

ఇక త్వరలో 'స్టూడెంట్ జిందాబాద్' సినిమాను మొదలుపెడతాము. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇక త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నాను. ఆ సినిమాకి నేనే దర్శకత్వం చేస్తాను. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

Vishwak Sen
Ruksar Dhillon
Asokavanamlo Arjuna Kalyanam Movie
  • Loading...

More Telugu News