Kajal Aggarwal: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్?

Kajal Aggarwal decided to stop acting

  • ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్
  • పూర్తి సమయాన్ని కొడుకుకే వెచ్చించాలనుకుంటున్న ముద్దుగుమ్మ  
  • కాజల్ తన మనసు మార్చుకుంటుందనే ఆశలో అభిమానులు

టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆమె భావిస్తోందట. ఈ విషయాన్ని అధికారికంగా ఆమె ప్రకటించకపోయినప్పటికీ... కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇటీవలే కాజల్ నీల్ కిచ్లూ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

ఇకపై తన కుమారుడికే తన మొత్తం సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. సినిమాలలో నటిస్తే కొడుకుని చూసుకోవడానికి సమయం ఉండదనే ఆలోచనతో... పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పెళ్లయిన తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. 

అసలు ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమవుతుంటారు. తమ కుటుంబాలను చూసుకోవడం కోసం వారు సినీ కెరీర్ కు ముగింపు పలుకుతారు. పిల్లలు పెద్దయిన తర్వాత అవకాశాలు వస్తే... సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కాజల్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. 

మరోవైపు ఈ వార్తతో కాజల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటి ఇకపై నటించబోదనే వార్త వారికి రుచించడం లేదు. కాజల్ తన అభిప్రాయాన్ని మార్చుకుని సినిమాల్లో కొనసాగుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి కాజల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Kajal Aggarwal
Tollywood
Movies
  • Loading...

More Telugu News