Rajasekhar: 'శేఖర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపే!

Shekar movie update

  • రాజశేఖర్ తాజా చిత్రంగా రూపొందిన 'శేఖర్'
  • కథానాయికగా నటించిన ముస్కాన్ 
  • అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్  
  • ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల 

రాజశేఖర్ తాజా చిత్రంగా 'శేఖర్' రూపొందింది. రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమాకి జీవిత దర్శకత్వం వహించారు. కెరియర్ పరంగా రాజశేఖర్ కి ఇది 91వ సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్ డిఫరెంట్ లుక్ తో  కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆయన ఫస్టులుక్ వచ్చినప్పుడే మంచి మార్కులు పడిపోయాయి.  

ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం  11 గంటలకు హైదరాబాద్ - ఏఎంబీ సినిమాస్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. 

మలయాళంలో ఆ మధ్య హిట్ కొట్టిన ' జోసఫ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ చేసి ఉంటాడు. అయినా కొన్ని కేసుల విషయంలో డిపార్ట్మెంట్ ఆయన హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది. ముస్కాన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శివాని రాజశేఖర్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News