Navneet Kaur: జైలు నుంచి విడుదలైన నవనీత్ కౌర్!

Navneet Kaur Rana released from jail

  • హనుమాన్ చాలీసా పఠిస్తామన్న కేసులో నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్
  • బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
  • కాసేపటి క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన నవనీత్

సినీ నటి, మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామన్న కేసులో ఆమెను, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను విచారించిన ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, నవనీత్ కౌర్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె భర్త కాసేపట్లో విడుదల కానున్నారు. 

మరోవైపు ముంబైలోని ఖర్ ప్రాంతంలోని వీరి నివాసం ఒక అక్రమ కట్టడమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వీరికి ఇంతకు ముందే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ఇంటిని ఈ ఉదయం బీఎంసీ అధికారులు పరిశీలించారు.

Navneet Kaur
Ravi Rana
Tollywood
Bail
Jail
  • Loading...

More Telugu News