Junior NTR: ఎన్టీఆర్ కి రిహార్సల్స్ అవసరమే లేదు: శేఖర్ మాస్టర్

Sekhar Master Interview

  • ఈ మధ్య  కాలంలో మంచి పాటలు పడ్డాయన్న శేఖర్ మాస్టర్
  • హీరోల బాడీ లాంగ్వేజ్ ను బట్టే డాన్స్ కంపోజ్ చేస్తానంటూ వెల్లడి
  • టాలీవుడ్  హీరోలంతా మంచి డాన్సర్లే నంటూ కితాబు 
  • ఎన్టీఆర్ స్పెషాలిటీ ఏమిటో చెప్పిన శేఖర్ మాస్టర్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస స్టార్ హీరోల సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'కళావతి' ..  'భలే భలే బంజారా' పాటలు ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించి మాట్లాడాడు.

" స్టార్  హీరోలతో కలిసి పనిచేసే అవకాశాలు వరుసగా వస్తున్నందుకు సంతోషంగా ఉంది. హీరోలు .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయడం వలన, వాళ్ల అభిమానులకు వెంటనే కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త స్టెప్స్ ను పరిచయం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. 

టాలీవుడ్లో హీరోలంతా డాన్స్ బాగా తెలిసినవారే. అయితే రిహార్సల్స్ అవసరం లేకుండా ఒకసారి మూమెంట్స్ చూపించగానే వెంటనే పట్టేసి, చాలా ఈజీగా డాన్స్ చేసేది మాత్రం ఎన్టీఆర్ ఒక్కడే. ఆయనకి రిహార్సల్స్ అవసరం లేదు .. నేరుగా  సెట్ కి వచ్చేస్తారు అంతే" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News