Mahesh Babu: కీర్తి సురేశ్ ను మహేశ్ సిఫార్స్ చేయలేదు: పరశురామ్

Sarkaru Vaari Paata movie update

  • కథ వినగానే మహేశ్ ఓకే చెప్పారన్న పరశురామ్ 
  • కథ నచ్చితే ఆయన ఇక జోక్యం చేసుకోరని వ్యాఖ్య      
  • కీర్తి సురేశ్ ఎంపిక తన వైపు నుంచే జరిగిందని వెల్లడి 
  • మహేశ్ అభ్యంతరం చెప్పలేదన్న పరశురామ్ 

మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' సినిమాను పరశురామ్ రూపొందించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి పరశురామ్ మాట్లాడుతూ .. 'గీత గోవిందం' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నేను ఈ సినిమా కథ రాసుకుని మహేశ్ బాబుగారికి వినిపించాను. 

ఈ కథను మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ విన్నారు. దానిని బట్టే ఆయనకి ఈ కథ నచ్చిందనే విషయం నాకు అర్థమైపోయింది. కథ చాలా బాగుందంటూ మహేశ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారని ఆయన అడిగితే కీర్తి సురేశ్ అని చెప్పాను. అందుకు ఆయన ఓకే అనేశారు. 

కీర్తి సురేశ్ ను చూసిన దగ్గర నుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. అది ఈ సినిమాకి కుదిరింది. నేను ఆమెను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఏదో ఉండే ఉంటుందని ఆయన అనుకున్నారు. కథ ఒకసారి లాక్ చేసిన తరువాత మహేశ్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోరు" అని చెప్పాడు.

Mahesh Babu
Keerthy Suresh
Parashuram
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News