Pawan Hans: ప్రైవేట్ కంపెనీ చేతికి ప‌వ‌న్ హాన్స్‌... డీల్‌పై అనుమానం వ్య‌క్తం చేసిన‌ కేటీఆర్

ktr expresses doubts over Pawan Hans deal

  • హెలికాప్ట‌ర్ సేవ‌లందిస్తున్న ప‌వ‌న్ హాన్స్‌
  • లాభాల బాటలో సాగుతున్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌
  • రూ.211 కోట్ల‌కు విక్ర‌యించేసిన కేంద్రం
  • డీల్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఆసక్తిక‌ర ట్వీట్‌

భార‌త ప్రభుత్వం, ఓఎన్జీసీ సంయుక్త ఆధ్వర్యంలోని ప‌వ‌న్ హాన్స్‌ సంస్థలోని తన వాటాను ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హెలికాప్టర్ సేవ‌ల‌ను అందిస్తున్న ఈ సంస్థ లాభాల బాట‌లో సాగుతుండగా కేంద్రం తన వాటాను ఓ అనామ‌క ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యించిన తీరును ప్ర‌శ్నిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 

లాభాల బాట‌లో సాగుతున్న ప‌వ‌న్ హాన్స్‌ను ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించిన కేటీఆర్‌... 2017లో రూ.3,700 కోట్ల నిక‌ర విలువ క‌లిగిన‌ ప‌వ‌న్ హాన్స్‌ లోని తన వాటాను కేవ‌లం రూ.211 కోట్ల‌కు విక్ర‌యించిన తీరును కూడా ప్ర‌శ్నించారు. ఇక ప‌వ‌న్ హాన్స్‌ను కొనుగోలు చేసిన కంపెనీ ఆరు నెల‌ల క్రితం కేవ‌లం కూ.1 ల‌క్ష కేపిట‌ల్‌తో ప్రారంభ‌మైందని, ఈ కారణంగా ఈ డీల్‌పై ప్ర‌శ్న‌ల‌తో పాటు అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్రం వ‌ద్ద ఏమైనా స‌మాధానాలు ఉన్నాయా? అని కూడా కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇదిలావుంచితే, పవన్ హాన్స్ లో భారత ప్రభుత్వం, ఓఎన్జీసీ కలిసి 51:49 నిష్పత్తిలో భాగస్వామ్యాన్ని కలిగివున్నాయి. ఓఎన్జీసీ కూడా తన 49 శాతం వాటాను 202.86 కోట్లకు విక్రయిస్తోంది. 

  • Loading...

More Telugu News