Mette Frederiksen: డెన్మార్క్ చేరుకున్న మోదీ... ఆ దేశ ప్ర‌ధానితో ఏకాంత‌ చ‌ర్చ‌లు

pm narendra modi reaches denmark

  • జ‌ర్మ‌నీ టూర్‌ను ముగించిన మోదీ
  • అటు నుంచి అటే డెన్మార్క్‌కు ప‌య‌నం
  • డెన్మార్క్ ప్ర‌ధాని బంగ్లా లాన్‌లో ఏకాంత చ‌ర్చ‌లు

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ యూర‌ప్ ప‌ర్య‌టన కొన‌సాగుతోంది. నేటి ఉదయం జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్న మోదీ... అటు నుంచి అటే డెన్మార్క్ వెళ్లారు. నేటి మ‌ధ్యాహ్నం కోపెన్ హాగ‌న్ చేరుకున్న మోదీకి డెన్మార్క్ ప్ర‌ధాని మెట్టే ఫ్రెడెరిక్‌స‌న్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మోదీతో క‌లిసి ఫ్రెడెరిక్‌స‌న్ త‌న అధికారిక నివాసంలోని లాన్‌లో ఏకాంత చ‌ర్చ‌లు జ‌రిపారు. 

మోదీని స్వ‌యంగా లాన్ చివ‌ర‌కు తీసుకెళ్లిన ఫ్రెడెరిక్‌స‌న్‌.. అక్క‌డే నిల‌బ‌డి మోదీతో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ఆ త‌ర్వాత లాన్‌ మొత్తం క‌లియ‌దిరుగుతూ ఇరు దేశాల ప్ర‌ధానులు చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు. ఈ చ‌ర్చ‌ల్లో ఫ్రెడెరిక్‌స‌న్ కంటే కూడా మోదీనే ఉత్సాహంగా క‌నిపించారు.

Mette Frederiksen
Denmark
Prime Minister
Narendra Modi
Europe Tour

More Telugu News