TTD: తిరుమ‌లలో యాంక‌ర్ సుమ.. సెల్ఫీలు తీసుకోవ‌డానికి అభిమానుల పోటీ.. వీడియో ఇదిగో

Anchor Suma visits Tirumala temple ahead of Jayamma Panchayathi release

  • శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సుమ‌
  • స్వామి స‌న్నిధానానికి వ‌స్తే ప‌ది రెట్ల శ‌క్తి వ‌చ్చేస్తుందని వ్యాఖ్య‌
  • అంద‌రూ బాగుండాల‌ని, అందులో తామూ ఉండాల‌న్న యాంక‌ర్

యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయితీ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న నేఫ‌థ్యంలో ఆమె జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. ఈ నేప‌థ్యంలో ఆమె ఈ రోజు ఉదయం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆమెతో సెల్ఫీలు తీసుకోవ‌డానికి అభిమానులు పోటీ ప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా సుమ మాట్లాడుతూ.... స్వామి స‌న్నిధానానికి వ‌స్తే ప‌ది రెట్ల శ‌క్తి వ‌చ్చేస్తుందని ఆమె చెప్పింది. స్వామి వారిని చూసే భాగ్యం క‌లిగింద‌ని తెలిపింది. అంద‌రూ బాగుండాల‌ని, అందులో తామూ ఉండాల‌ని చెప్పింది. జ‌య‌మ్మ పంచాయితీ సినిమా ఈ నెల 6న విడుద‌ల అవుతుంద‌ని, ఈ సంద‌ర్భంగా సినీ బృందంతో క‌లిసి ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని తెలిపింది.  

          

  • Loading...

More Telugu News