Ganta Srinivasa Rao: పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు తరచూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: గంటా శ్రీ‌నివాస‌రావు

ganta on tenth exams

  • పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేన‌న్న గంటా
  • లోపాలు ఉంటే విద్యార్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ట్వీట్
  • దాన్ని విద్యార్థులు జీవన్మరణ సమస్యగా భావించే అవకాశం ఉంద‌ని వ్యాఖ్య‌

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు తరచూ వార్తలు వ‌స్తుండ‌డం ఆందోళన కలిగిస్తోంద‌ని టీడీపీ నేత గంటా శ్రీ‌నివాసరావు అన్నారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

'పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు తరచూ వస్తోన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అది విద్యార్థుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాన్ని విద్యార్థులు జీవన్మరణ సమస్యగా భావించే అవకాశం కూడా ఉంది.

గతంలో పకడ్బందీ అకడమిక్ ప్రణాళిక రూపొందించి అంతే నిబద్ధ‌తతో దాన్ని అమలు చేశాం. ఎక్కడా ఎలాంటి చిన్న అపోహకు కూడా తావివ్వలేదు. అలా కాకుండా విద్యార్థుల్లో నమ్మకం కోల్పోయేలా పరిణామాలు సంభవిస్తుండడం దురదృష్టకరం' అని గంటా శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.  

Ganta Srinivasa Rao
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News