Rajasekhar: రాజ'శేఖర్' సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది!

Sekhar movie trailer coming on May 5

  • ఈ నెల 20న విడుదలవుతున్న 'శేఖర్'
  • 5వ తేదీన విడుదలవుతున్న ట్రైలర్
  • రాజశేఖర్ కూతురుగా నటించిన శివాని

రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న 'శేఖర్' సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. రాజశేఖర్ కెరీర్లో 91వ సినిమాగా ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాలో రాజశేఖర్ లుక్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 5న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. 

ఈ చిత్రానికి రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు. వీరి పెద్ద కూతురు శివాని కీలక పాత్రలో నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో టారస్ సినీ కార్ప్, పెగాసన్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మరోవైపు ఇటీవల జీవిత మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అవుతుందని చెప్పారు. ఎమోషనల్ మూవీస్ ని ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు పాత్రలో శివాని నటించిందని... వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం తమకు మరిచిపోలేని సినిమా అవుతుందని అన్నారు.

Rajasekhar
Sekhar Movie
Jeevitha
Trailer
Tollywood
  • Loading...

More Telugu News