Chiranjeevi: అమెజాన్ ప్రైమ్ లో 'ఆచార్య'?

Acharya movie update

  • క్రితం నెల 29వ తేదీన వచ్చిన 'ఆచార్య'
  • బలహీనమైన కథాకథనాలే మైనస్ 
  • ఇతర పాత్రల్లో బలంగా లేకపోవడం మరో కారణం 
  • ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో పలకరించే  ఛాన్స్   

చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రధారులుగా రూపొందిన 'ఆచార్య' క్రితం నెల 29వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి -  అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే కథాకథనాల విషయంలోను .. సంభాషణల విషయంలోను ఎక్కడా కొరటాల మార్కు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వీకెండ్ లోనే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారు ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టుగా సమాచారం.

 ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. తిరు ఫొటోగ్రఫీ కూడా అదనపు బలంగా నిలిచింది. చిరంజీవి - చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడం, పూజ హెగ్డే .. సోనూ సూద్ .. అజయ్ .. వెన్నెల కిశోర్ .. తనికెళ్ల భరణి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం ప్రేక్షకులను నిరాశకు లోనుచేసింది.      


Chiranjeevi
Ramcharan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News