Kakinada: సామర్లకోటలో దారుణం: పట్టపగలు నడిరోడ్డుపై స్నేహితుడిని నరికి చంపిన యువకుడు

Dreaded Murder in Kakinada dist Samarlakota

  • స్నేహితుడు శివపై పగ పెంచుకున్న మణికంఠ 
  • బిర్యానీ కొనేందుకు వచ్చిన శివను నరికి చంపిన వైనం
  • తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన మణికంఠ 

కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. పుట్టిన రోజు జరుపుకుంటున్న స్నేహిడుతుడిని అతి దారుణంగా అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక భాస్కర్‌నగర్‌‌లో నివసిస్తున్న తలాటి శివ (28) తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వీరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడి నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు. 

మరోవైపు, శివపై పగ పెంచుకున్న మణికంఠ అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న బర్త్ డే కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికంఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడిచేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మణికంఠ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శివ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Kakinada
Samarlakota
Andhra Pradesh
Murder
  • Loading...

More Telugu News