LSG: ఐపీఎల్ లో నేడు సండే డబుల్ హెడర్... ఢిల్లీపై టాస్ గెలిచిన లక్నో

Lucknow won the toss

  • ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
  • రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై

నేడు ఆదివారం కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలిమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతుండగా... రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్నాయి. 

కాగా, తొలి మ్యాచ్ లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ నుంచి ఆవేశ్ ఖాన్ కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అతడి స్థానంలో గౌతమ్ జట్టులోకి వచ్చాడని లక్నో సారథి కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇక ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.

LSG
Toss
Delhi Capitals
Double Header
SRH
CSK
  • Loading...

More Telugu News