Angelina Jolie: ఉక్రెయిన్ కు వెళ్లిన‌ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ.. వీడియో ఇదిగో

Angelina Jolie visits ukrain

  • ఉక్రెయిన్ లోని లివివ్‌లో ప‌ర్య‌ట‌న‌
  • గాయ‌ప‌డ్డ‌ చిన్నారులను ప‌రామ‌ర్శించిన ఏంజెలీనా జోలీ
  • ఓ కేఫ్ కు వెళ్లి అక్క‌డున్న వారితో మాట్లాడిన న‌టి

ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య‌ యుద్ధం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ కు హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఉక్రెయిన్ లోని లివివ్‌లో ఆమె క‌న‌ప‌డిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అక్క‌డి క్రమాటోర్క్స్‌ రైల్వేస్టేషన్‌పై రష్యా బలగాలు దాడులు చేయ‌గా చాలా మంది చిన్నారులు గాయ‌ప‌డ‌డంతో వారిని ఏంజెలీనా జోలి పరామర్శించారు. 

చిన్నారుల‌కు చికిత్స అందిస్తూ సాయం చేస్తోన్న‌ వాలంటీర్లతో ఆమె మాట్లాడారు. అక్క‌డి ఓ కేఫ్ కు వెళ్లి అక్క‌డున్న వారితోనూ ఆమె మాట్లాడారు. ఆమె ఐక్యరాజ్య సమితి త‌ర‌ఫున అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Angelina Jolie
Ukraine
Russia
  • Loading...

More Telugu News