Thaman: కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు: తమన్

Thaman reveals leakage issue details

  • మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా సర్కారు వారి పాట
  • మే 12న రిలీజ్
  • ప్రమోషన్ ఈవెంట్స్ లో తమన్
  • ఆసక్తికర అంశం వెల్లడి 

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. కాగా, ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించాడు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అని, మొదటి నుంచి చివరి వరకు ఒకే స్పార్క్ కొనసాగుతుందని, ఎక్కడా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యే అంశాలే ఉండవని తమన్ స్పష్టం చేశాడు. 

కాగా, సర్కారు వారి పాట చిత్రానికి పాటల కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ఓ పాట లీక్ కావడం తమను ఎంతో బాధకు గురిచేసిందని తెలిపాడు. ఆ పాటను ఎవరు లీక్ చేశారో గుర్తించామని వెల్లడించాడు. అయితే, సర్కారు వారి పాట నిర్మాతలు మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టారని తమన్ పేర్కొన్నాడు. వాళ్ల కెరీర్ నాశనం కాకూడదన్న ఉద్దేశంతో పెద్దమనసుతో ఆలోచించిన నిర్మాతలు కేవలం వార్నింగ్ ఇచ్చి పంపించారని వివరించాడు. 

కరోనా సంక్షోభం వల్ల టాలీవుడ్ నిర్మాతలు ఎంతో నష్టపోయారని, అలాంటి సమయంలో ఇలాంటి లీకులు ఎలా చేస్తారో అర్థం కాదని అన్నారు. ఎవరైనా ఇండస్ట్రీ బాగు కోరుకోవాలని తమన్ హితవు పలికారు.

Thaman
Sarkaru Vaari Paata
Song
Leak
Mahesh Babu
Tollywood
  • Loading...

More Telugu News