Krithi Shetty: నా డ్రీమ్ రోల్ అదే .. దాని కోసమే వెయిటింగ్: కృతి శెట్టి

Krithi Sjetty Interview

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కృతి శెట్టి
  • విడుదలకి సిద్ధంగా ఉన్న మూడు సినిమాలు
  • వైవిధ్యభరితమైన పాత్రలు చేయడమే ఇష్టమంటూ వ్యాఖ్య 
  • రాకుమారి పాత్ర కోసమే వెయిటింగ్ అంటూ మనసులో మాటను బయటపెట్టిన కృతి శెట్టి      

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై దూసుకుపోతున్న కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. తొలి సినిమా 'ఉప్పెన'తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత చేసిన 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.
 
ప్రస్తుతం కృతి శెట్టి నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి. సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. నితిన్ జోడీగా చేసిన 'మాచర్ల నియోజకవర్గం' ..  రామ్ సరసన కథానాయికగా చేసిన 'ది వారియర్' ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. 

 తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. " ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. తెరపై 'రాకుమారి'గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది

Krithi Shetty
Ram
Nithin
Tollywood
  • Loading...

More Telugu News