Balka Suman: కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడు: బాల్క సుమన్ 

Balka Suman gives warning to BJP

  • బండి సంజయ్ ది పాపాలు కడుక్కునే యాత్ర
  • మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయి
  • తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ముకాశారు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకోవడం సరికాదని... అడ్డుకోవడమే బీజేపీ పని అయితే... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడని, బండి సంజయ్ పాదయాత్ర చేయలేడని అన్నారు. బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, పాపాలను కడుక్కునే యాత్ర అని ఎద్దేవా చేశారు. మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయని చెప్పారు. మన దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై బాల్క సుమన్ స్పందిస్తూ... తనను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి లేరని అన్నారు. తెలంగాణ ద్రోహులకు ఆయన కొమ్ము కాశారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని చెప్పారు.

Balka Suman
TRS
Kishan Reddy
Bandi Sanjay
BJP
Jagga Reddy
Rahul Gandhi
Congress
  • Loading...

More Telugu News